Home వీడియోస్ MLA Bala Krishna | ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు.. అంగన్వాడీలకు అండగా టీడీపీ

MLA Bala Krishna | ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు.. అంగన్వాడీలకు అండగా టీడీపీ

0

న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరవధిక నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మద్దతు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన బాలయ్య.. ఆ పార్టీ చేసిన అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఇందుకు ఉరవకొండలో పాత్రికేయులపై దాడి నిదర్శనమన్నారు.

Exit mobile version