రెండేళ్ల లోపే..
ఎలిజబెత్ బోర్న్ రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలమే ప్రధాని పదవిలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ఉండగా, అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దాంతో, ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్ ను నియమించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు దేశాధ్యక్షుడు మేక్రాన్ అప్పగించారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్రాన్స్ రినాయజెన్స్ పార్టీ నాయకుడు సిల్వైన్ మైలార్డ్ గాబ్రియేల్ అట్టల్ ను అభినందించారు, “మీరు మీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించగలరని, దేశ విలువలను ప్రతిబింబించగలరని నేను భావిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.