Ram Mandir consecration ceremony : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. అత్యంత సుందరంగా నిర్మించిన రామమందిరాన్ని.. ఈ నెల 22న ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. జనవరి 22న జరిగే కార్యక్రమం కోసం దేశ, విదేశాల్లోని 7వేల మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది. ఇందులోని 6వేల ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అథిథులకు చేరుకున్నట్టు సమాచారం. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రిక అందుకున్న వారిలో ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్ కూడా ఉన్నారు. రాజకీయ నేతల నుంచి సెలబ్రిటీల వరకు.. ఆహ్వానం అందుకున్న పలువురు ప్రముఖుల పేర్లను ఇక్కడ చూడండి..