టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డు అందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ అవార్డు తీసుకోవటం పట్ల షమీ సంతోషం వ్యక్తం చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో హీరోగా షమీ నిలిచాడు. క్రీడల్లో దేశం కోసం చేసిన సేవకు గాను ఈ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు షమీని వరించింది. ఏడు మ్యాచ్‌లలో, షమీ 10.70 సగటు, 12.20 స్ట్రైక్ రేట్‌తో 24 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.