Home ఎంటర్టైన్మెంట్ సరికొత్త రికార్డులు సెట్ చేసిన ‘దేవర’ గ్లింప్స్.. ఇది కదా ఊచకోత అంటే!

సరికొత్త రికార్డులు సెట్ చేసిన ‘దేవర’ గ్లింప్స్.. ఇది కదా ఊచకోత అంటే!

0

‘దేవర'(Devara)తో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) రికార్డుల వేట మొదలుపెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విడుదలై 24 గంటలు గడవక ముందే దేవర గ్లింప్స్(Devara Glimpse) సరికొత్త రికార్డులు సెట్ చేసింది.

‘దేవర’ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విజవల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ రెస్పాన్స్ కి తగ్గట్టుగానే వ్యూస్, లైక్స్ పరంగా యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది దేవర గ్లింప్స్. 21 మిలియన్ వ్యూస్ తో 24 గంటల్లో తెలుగులో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న గ్లింప్స్ గా ‘గుంటూరు కారం'(Guntur Kaaram) ఉండగా, విడుదలైన కొద్ది గంటల్లోనే ‘దేవర’ ఆ రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పటికే 23 మిలియన్ వ్యూస్ సాధించగా, 24 గంటల్లో 30 మిలియన్ వ్యూస్ సాధించే దిశగా దూసుకుపోతోంది. అలాగే 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన తెలుగు గ్లింప్స్ గా 730K లైక్స్ తో ‘ఓజీ'(OG) టాప్ లో ఉండగా, ఇప్పుడు ‘దేవర’ ఆ రికార్డుని బ్రేక్ చేసే దిశగా పయనిస్తోంది. మొత్తానికి 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన, లైక్ చేసిన తెలుగు గ్లింప్స్ గా దేవర నిలవనుంది.

ఇక తెలుగుతో పాటు ఇతర భాషల వెర్షన్స్ కూడా కలిపి ఓవరాల్ గా చూస్తే.. దేవర గ్లింప్స్ ఇప్పటికే యూట్యూబ్ లో 40 మిలియన్ కి పైగా వ్యూస్, 1 మిలియన్ కి పైగా లైక్స్ సాధించింది.

Exit mobile version