Mohammed Shami: 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు తరఫున టీ20 ఆడలేదు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ. వన్డేలు, టెస్టుల్లో ఆడుతూ వస్తున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్‍లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. టీ20ల్లో సీనియర్ పేసర్ల గైర్హాజరీలో భారత జట్టులో అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ సహా మరికొందరు యంగ్ ఫాస్ట్ బౌలర్లు చోటు దక్కించుకుంటున్నారు. అయితే, ఈ ఏడాది జూన్ 1 నుంచి 29వ తేదీ మధ్య జరిగే టీ20 ప్రపంచకప్‍లో భారత పేస్ దళం ఎలా ఉంటుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపైనే మహమ్మద్ షమీ స్పందించారు.