బాలుడిని తల్లి తూర్పాటి లక్ష్మికి సురక్షితంగా అప్పగించారు. స్థానిక యువకుల సహకారం తీసుకోవడంతో.. పిర్యాదు అందిన 90 నిమిషాల వ్యవధిలోనే బాలుడిని తల్లి చెంతకు చేర్చారు. తప్పిపోయిన బాలుడిని ట్రేస్ చేయడంలో కీలక పాత్ర పోషించిన సంగారెడ్డి రూరల్ సిబ్బందిని , విద్యానగర్ యువతను సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అభినందించారు. జిల్లా ప్రజలందరూ ఈ విధంగా పోలీసులకు సహకరించి, మెరుగైన, నేర రహిత సమాజం కోసం మీ వంతు సహకారం అందించాలన్నారు.