గంట ఎందుకు మోగిస్తారు?
దేవుడికి హారతి ఇచ్చే సమయంలో తప్పకుండా గంట మోగిస్తారు. ఒక చేత్తో హారతి ఇస్తూ మరొక చేత్తో గంట కొడతారు. ఈ గంటలు చేసే ధ్వని ఉత్పత్తి ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు దూరం చేస్తుందని నమ్ముతారు. ఈ గంట శబ్ధం వినిపించే దూరం వరకు దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి. అనేక సంస్కృతులో గంట శబ్ధం దైవిక ఉనికిని ఆహ్వానిస్తుంది. లయబద్ధంగా మోగించడం అనేది ఐక్యతకి ప్రతీక. ఇది ఆరాధకుల మనసుల్ని సమన్వయం చేస్తుంది. ఆద్యాత్మిక అనుభవాన్ని పెంపొందిస్తుంది. గంటలు మోగించే ఆచారం దైవిక, ఆధ్యాత్మిక మేల్కోలుపుకి, పూజ చేసేందుకు పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడాన్ని సూచిస్తుంది.