మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు జన్మరాశి యందు గురుడు, లాభస్థానములో శని, వ్యయస్థానములో రాహువు ప్రభావం చేత పనులలో ఒత్తిళ్లు ఏర్పడినప్పటికీ అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. భాగ్యములో రవి, కుజుడు, చంద్రుని ప్రభావం వలన శారీరక సౌఖ్యం, ఆనందం పొందుతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. స్త్రీ సౌఖ్యం, ఆనందము పొందుతారు. ప్రయాణాలలో ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు ఈవారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడుకున్నటువంటి సమయం. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన ణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లం నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.