కామన్ పొలిటికల్ ప్రోగ్రాంలో (సిపిపి) భాగంగా ఐదు సంవత్సరాల్లో వచ్చే ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ పదవులతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో జనసేనకు 1/3 దక్కేవిధంగా ఒప్పందం కుదుర్చుకోవాలి. స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిల్ వార్డులు, నగర పంచాయతీ వార్డులు, మున్సిపల్ కార్పోరేటర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభిస్తే, పార్టీ వేర్లు క్షేత్రస్థాయిలో బలపడతాయి. వీటితో పాటు సలహాదారులు, దేవాదాయ కమిటీలు, వివిధ కార్పోరేషన్లు, హైకోర్టు, కింద కోర్టుల్లో ఉన్న పలు నామినేటెడ్ పదవులతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో జనసేన పార్టీకి భాగస్వామ్యం ఉండేవిధంగా బిజెపితో కూడా ఒప్పందం కుదుర్చుకోవాలి.