స్పందించని ఏపీపీఎస్సీ?
వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడమే సమస్యగా ఉంటే, చివరికి ఓపెన్ అయిన వెంటనే ఎర్రర్ మేసెజ్ డిస్ ప్లే అవుతుందని అభ్యర్థులు అంటున్నారు. సర్వర్ లో సాంకేతిక సమస్యలతో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులో వివరాలు నమోదు, పేమెంట్ సమయాల్లో పదేపదే వెబ్‌సైట్ లాగ్ అవుట్ అవుతుందని అంటున్నారు. ఈ సమస్యలపై ఏపీపీఎస్సీని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడంలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో దరఖాస్తు గడువు ముగియడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు కష్టపడి చదివి కనీసం అప్లై చేసుకోలేకపోతున్నామంటున్నారు. ఏపీపీఎస్సీ సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రిపరేషన్ పై దృష్టిపెట్టాల్సిన సమయంలో దరఖాస్తు కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని అభ్యర్థులు అంటున్నారు.