Guntur Kaaram Pre Release Event – Dil Raju: గుంటూరు కారం సినిమా రిలీజ్‍కు సమీపించింది. మరో మూడు రోజుల్లో అంటే జనవరి 12వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జనవరి 9) గుంటూరులో గ్రాండ్‍గా జరుగుతోంది. మహేశ్ బాబు, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి, దర్శకుడు త్రివిక్రమ్ సహా మూవీ టీమ్ సభ్యులు ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు. అభిమానులు భారీ సంఖ్యలో గుంటూరు కారం ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి వచ్చారు. ఈ ఈవెంట్‍లో ప్రముఖ నిర్మాత దిల్‍రాజు మాట్లాడారు.