ఏ భాషలో అయినా పాన్ ఇండియా స్థాయిలో నటించే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటుల్లో విజయ్ సేతుపతి(Vijay sethupathi)కూడా ఒకడు. అభిమానులందరు మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే సేతుపతికి తెలుగుతో పాటు చాలా భాషల్లో లెక్కకు మించి అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.
విజయ్ సేతుపతి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఇక నుంచి సినిమాల్లో విలన్ గా కానీ గెస్ట్ రోల్స్ లో గాని నటించకూడదని డిసైడ్ అయినట్టుగా తెలిపాడు. ఇప్పుడు ఆయన చెప్పిన ఈ మాటలతో ఒక్కసారిగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే విజయ్ సేతుపతి చాలా భాషలకి చెందిన సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసి తనకి మాత్రమే సాధ్యమయ్యే నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. అలాంటిది ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంతో వాళ్లంతా చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు.
విజయ్ సేతుపతి నటించిన బాలీవుడ్ చిత్రం మెర్రీ క్రిస్మస్(merry christmas)విడుదలకి సిద్ధం అవుతుంది. కత్రినా కైఫ్( katrina kaif) తో కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన సేతుపతి ఆ సినిమాతోనే ఇక గెస్ట్ రోల్స్ లో నటించనని చెప్పడం గమనార్హం.ఈ నెల 12 మెర్రీ క్రిస్మస్ విడుదలకి సిద్ధం అవుతుంది. అలాగే షారుఖ్ జవాన్ లో కూడా విజయ్ సేతుపతి అధ్బుతంగా నటించి ఆ మూవీ ఘన విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.