న్యూ ఈయర్ లో ఫస్ట్ ఐపీఓ
జ్యోతి సీఎన్ సీ ఆటోమేషన్ (Jyoti CNC Automation) గుజరాత్ కు చెందిన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషీన్ల తయారీ సంస్థ. ఈ కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన తొలి ఐపీఓ ఇదే (Jyoti CNC Automation IPO) కావడం విశేషం. ఇష్యూ ద్వారా వచ్చే మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలతో పాటు ఫండింగ్, రుణ చెల్లింపు, కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి కంపెనీకి రూ.3,315.33 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఈక్విరస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.