ప్రవీణ్ కుమార్ కెరీర్ ఇలా..
భారత్ తరఫున ప్రవీణ్ కుమార్ 68 వన్డేలు ఆడి 77 వికెట్లు పడగొట్టారు. 6 టెస్టుల్లో 27 వికెట్లు తీసిన ఆ ఫాస్ట్ బౌలర్.. 10 అంతర్జాతీయ టీ20ల్లో 8 వికెట్లు దక్కించుకున్నారు. 2018లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి ప్రవీణ్ కుమార్ రిటైర్ అయ్యారు. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్ల తరఫున ప్రవీణ్ ఆడారు. 2017 వరకు ఐపీఎల్ ఆడారు. మొత్తంగా ఐపీఎల్లో 119 మ్యాచ్లు ఆడిన ప్రవీణ్ కుమార్ 7.73 ఎకానమీతో 90 వికెట్లు తీసుకున్నారు.