Home తెలంగాణ సంక్రాంతి రద్దీ, ఈ నగరాల మధ్య మరో 6 ప్రత్యేక రైళ్లు-hyderabad news in telugu...

సంక్రాంతి రద్దీ, ఈ నగరాల మధ్య మరో 6 ప్రత్యేక రైళ్లు-hyderabad news in telugu south central railway six more special trains between ap ts cities ,తెలంగాణ న్యూస్

0

ప్రత్యేక రైళ్ల వివరాలు

  • తిరుపతి-సికింద్రాబాద్(07055) – జనవరి 10వ తేదీన
  • సికింద్రాబాద్-కాకినాడ టౌన్(07056)-జనవరి 11న
  • కాకినాడ టౌన్-సికింద్రాబాద్(07057)- జనవరి 12న
  • సికింద్రాబాద్-కాకినాడ టౌన్(07071)-జనవరి 13న
  • కాకినాడ టౌన్-తిరుపతి(07072)-జనవరి 14న
  • తిరుపతి-కాచిగూడ(02707)-జనవరి 15న

మరిన్నీ రైళ్లు

తిరుపతి – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. జనవరి 10వ తేదీన తిరుపతి నుంచి ఉదయం 05.30 నిమిషాలకు బయల్దేరి…. మరునాడు 05.15 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, కర్నూలు, గద్వాల, జడ్చర్ల, షాద్ నగర్, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఇక సికింద్రాబాద్ – కాకినాడ మధ్య ప్రత్యేక టైన్ ను ప్రకటించింది. ఈ ట్రైన్ జనవరి 10వ తేదీన సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 7 గంటలకు కాకినాడకు చేరుతుంది. ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది.

Exit mobile version