ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)భార్య స్నేహరెడ్డి(sneha reddy)ఒక పక్కన తన కుటుంబ బాధ్యతలు చూసుకుంటునే ఇంకో పక్క వ్యాపార బాధ్యతల్ని కూడా నిర్వహిస్తు ఉంటుంది. ఆమె పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్( Picabu Present Firefly Carnival)అనే ఒక వ్యాపార సంస్థని స్థాపించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఒక తియ్యటి వార్త వచ్చింది.
ఈ నెల జనవరి 20 న మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో పికాబు సంస్థ ఫైర్ ఫ్లై కార్నివాల్ ని నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంస్థ టాప్ స్టిచ్ అనే మరో సంస్థతో జతకట్టి నగర వాసులకి సరికొత్త అనుభూతిని మిగల్చబోతుంది. ఈ కార్నివాల్ కి విచ్చేసిన వాళ్ళకి షాపింగ్ ఎంజాయ్ మెంట్ తో పాటు రకరకాల యాక్టివిటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే రుచికరమైన వంటకాలు మరియు లైవ్ మ్యూజిక్ తో ఆకట్టుకునే విధంగా కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది.
ఈ మెగా ఫైర్ ఫ్లై కార్నివాల్ లో 100 స్టాళ్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఐదుగురు ఆర్టిస్ట్ లు అక్కడికి విచ్చేసిన వాళ్ళని తమ పెర్ ఫార్మెన్స్ తో మెప్పించనున్నారు. అలాగే రక రకాల వంటకాలతో 30 కి పైగా స్టాల్ల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే పలు అంతర్జాతీయ సంస్థలు పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ కి బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉన్నారు.