Home ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఇన్ ఛార్జుల తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు-శింగనమల ఎమ్మెల్యే వీడియోపై ఆగ్రహం-tadepalli news...

వైసీపీ ఇన్ ఛార్జుల తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు-శింగనమల ఎమ్మెల్యే వీడియోపై ఆగ్రహం-tadepalli news in telugu cm jagan discussion on ysrcp final list incharge series on singanamala mla ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు

పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ ఛార్జ్ ల మార్పు తుది జాబితాపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువులు ఎమ్మెల్యేలు, ఎంపీలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వీరితో సీఎం జగన్ స్వయంగా మాట్లాడుతున్నారు. అమలాపురం ఎంపీ చింత అనురాధ, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, ఎంపీ గోరంట్ల మాధవ్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మంత్రి బొత్స సత్య నారాయణ కూడా తన సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి తాడేపల్లి క్యాంపు ఆఫీసుకి వచ్చారు. డోన్ నుంచి పోటీ చేసేందుకు మంత్రి బుగ్గన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

Exit mobile version