CM Revanth Reddy : గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది.