Home ఎంటర్టైన్మెంట్ ఆయనతో రొమాన్స్ సూపర్ గా వచ్చిందంటున్న హీరోయిన్..

ఆయనతో రొమాన్స్ సూపర్ గా వచ్చిందంటున్న హీరోయిన్..

0

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నుంచి ఈ సంక్రాంతికి వస్తున్న  మోస్ట్ అవైటెడ్ మూవీ నా సామి రంగ. ఈ మూవీ కోసం నాగ్ అభిమానులు ఎంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారో ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ట్రైలర్ కూడా ఒక రేంజ్ లో ఉండటంతో  రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ మూవీ హీరోయిన్ నాగార్జున గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి

 నా సామిరంగ లో హీరోయిన్ గా కన్నడ భామ ఆషికా రంగనాద్ నాగార్జునతో జత కడుతుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూ లో  మాట్లాడుతు నాగార్జున గారు చాలా రొమాంటిక్ పర్సన్.ఈ మూవీలో నాకు ఆయన మధ్య కథ పరంగా వచ్చిన  రొమాన్స్ సన్నివేశాలు సూపర్ గా వచ్చాయని చెప్పింది. అలాగే నాగార్జున గారు చాలా స్వీట్ పర్సన్ అని అలాంటి ఆయనతో కలిసి పని చెయ్యడం మరపురాని అనుభూతుని కూడా ఇచ్చిందని  ఆషికా తెలిపింది.

ఇప్పుడు నాగార్జున గురించి  ఆషికా చేసిన ఆ వ్యాఖ్యలు  నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నాగార్జున కెరీర్లోనే అత్యథిక థియేటర్స్ లో విడుదల అవుతున్న నా సామి రంగ కి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించగా ఏం ఏం కీరవాణి సంగీతాన్ని అందించాడు. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. జనవరి 14 న మూవీ నాగార్జున కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో నా సామి రంగ విడుదల అవుతుంది. 

 

Exit mobile version