వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు 14 రోజుల చేస్తున్న సమ్మె మరింత ఉద్ధృతమైంది. న్యాయపరమైన డిమాండ్లు వెంటనే తీర్చాలని కార్మికులు అడుగుతున్నారు. ఇవాళ విజయవాడ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మహిళా మున్సిపల్ కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో మహిళా కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. మహిళా కార్మికులు అని కూడా చూడకుండా పోలీసులు కర్కషంగా ప్రవర్తించాలని సీఐటీయూ, ఏఐటీసీయూ నాయకులు మండిపడ్డారు.