పుష్ప (pushpa) మొదటి పార్ట్ లో సమంత(samantha)ఐటెం సాంగ్ ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అంతే కాదు పుష్ప ఘన విజయానికి ఆ పాట కూడా తన వంతు సాయం చేసింది. పుష్ప కి కంటిన్యూగా వస్తున్న పుష్ప 2 (pushpa 2) లో కూడా ఒక ఐటెం సాంగ్ ఉండబోతుంది. దీనికి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
పుష్ప 2 లోని ఐటెం సాంగ్ ని మొదటగా చిరంజీవి (chiranjeevi) తో వాల్తేరు వీరయ్య మూవీలోని ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి రౌతాలా మీద తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ పుష్ప లోని ఐటెం సాంగ్ కి వచ్చిన బజ్ రావాలంటే సమంత లాంటి స్టార్ హీరోయిన్ చేత చేయిస్తేనే బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఐటమ్ సాంగ్ ని సుకుమార్ చాలా ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేసాడనే వార్తలైతే వస్తున్నాయి.
బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఐటెం సాంగ్ ఒక రేంజ్ లో ఉండాలని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న పుష్ప 2 కి దేవి శ్రీ ప్రసాద్ (devi sriprasad) అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. రష్మికా మందన్న( rashmika mandanna) బన్నీ కి జోడీకడుతుండగా పుష్ప పార్ట్ 1 లో నటించిన నటులు కాకుండా ఇంకొంత మంది కొత్త నటులు కూడా పార్ట్ 2 లో మెరవనున్నారు.