Saturday, October 19, 2024

నాపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా : దిల్‌రాజు

సంక్రాంతి వచ్చిందంటే సినిమాల సందడి మొదలవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ హీరో అయినా తన సినిమా సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనుకుంటాడు. అలా అనుకోవడం వల్ల సంక్రాంతి సీజన్‌లో సినిమాల మధ్య పోటీ బాగా పెరిగిపోతుంది. అన్ని సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమైపోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి ఐదు సినిమాలు బరిలో ఉన్నాయి. వీటిలో కొన్ని వెనక్కి వెళితే అందరూ సేఫ్‌ జోన్‌లో ఉంటారని ఫిలింఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ భావించింది. దానికోసం నిర్మాతలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేశారు. చివరికి రవితేజ హీరోగా నటించిన ‘ఈగిల్‌’ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు దిల్‌రాజుపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే తనపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

తనపై వస్తున్న తప్పుడు వార్తల గురించి దిల్‌రాజు స్పందిస్తూ ‘‘మంచి చెయ్యాలనుకునేవారికే రాళ్ళు పడుతూ ఉంటాయి. పక్కనే ఉంటూ మనపై రాళ్ళు వేస్తారు. ప్రతి సంక్రాంతికి అందరూ నన్నే టార్గెట్‌ చేస్తారు. ఇది ఏడెనిమిది సంవత్సరాలుగా జరుగుతోంది. సంక్రాంతి సినిమాల రిలీజ్‌ విషయంలో చిరంజీవిగారు మాట్లాడుతూ దిల్‌రాజు ఎక్స్‌సీరియన్స్‌ పర్సన్‌. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అతనికి తెలుసు అని ఎంతో సాఫ్ట్‌గా చెప్పారు. దాన్ని కొన్ని వెబ్‌సైట్లు వక్రీకరించి రాశాయి. నన్ను టార్గెట్‌ చేసి నా గురించి తప్పుడు వార్తలు రాయడం వల్ల మీ వెబ్‌సైట్స్‌కి ఇంపార్టెన్స్‌ పెరుగుతుందని అలా చేస్తున్నారా. ఏం రాసినా దిల్‌రాజు పట్టించుకోడులే. చాలా కూల్‌గా ఉంటాడు అనుకుంటున్నారా. తాటతీస్తా. ఇకపై నా గురించి ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదు. ఇప్పటివరకు జరిగింది వేరు, ఇకపై జరగబోయేది వేరు. సినిమా అనే ఈ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని వారికి అనుగుణంగా మార్చుకొని వెబ్‌సైట్లలో, యూ ట్యూబ్‌ ఛానల్స్‌లో వేస్తున్నారు. అది చాలా తప్పు. ఈరోజు నుంచి ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదు. ఈమధ్య ఓ వెబ్‌సైట్‌లో ఎవరో రాశారు.. దిల్‌రాజు ఓ తమిళ్‌ సినిమా రిలీజ్‌ చేస్తున్నాడని. అసలు ఆ సినిమాను పోస్ట్‌ పోన్‌ చెయ్యమని చెప్పిందే నేను. అలాగే హనుమాన్‌ సినిమాను విడుదల చెయ్యాలని కూడా నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్‌, గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. అయితే నాగార్జున, వెంకటేష్‌ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. ఈ సమస్యను ఎంత సామరస్యంగా పరిష్కరిద్దామని నేను చూస్తుంటే నాపై తప్పుడు రాతలు రాస్తున్నారు. అలా రాసి ఏం చేద్దామనుకుంటున్నారు. ఇకపై వెబ్‌సైట్స్‌ నాపై తప్పుడు రాతలు రాస్తే మాత్రం ఊరుకునేది లేదు. మరోసారి చెబుతున్నాను’’ అన్నారు. 

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana