పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను నియమించిన బీజేపీ, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పజెప్పింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ కు ఇన్ఛార్జ్ బాధ్యతల అప్పజెప్పింది. గతంలో ఆ పార్టీ సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో విజయం సాధించగా, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పార్టీకి కొంత ఊపు వచ్చినా అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలను గెలుచుకోలేక పోయినా, గతం కంటే ఓట్ల శాతం మెరుగవడంతో పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలపై గురిపెట్టింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు స్థానాలకు బీజేపీ నుంచి ఇన్ఛార్జులుగా నియమితులైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – పాయక్ శంకర్ , పెద్దపల్లి – రమారావు పాటిల్, కరీంనగర్ – ధనపాల్ సూర్యనారాయణ గుప్తా , నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి, జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణరెడ్డి, మెదక్ – పాల్వాయి హరీష్ బాబు, మల్కాజ్‌గిరి – పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ – కే.లక్ష్మణ్, హైదరాబాద్ – రాజసింగ్, చేవెళ్ళ – ఏవీఎన్ రెడ్డి, మహబూబ్‌నగర్ – రామచంద్రరావు, నాగర్‌కర్నూల్ – మాగం రంగారెడ్డి, నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ – మర్రి శశిధరరెడ్డి, మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు, ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి.