Home ఎంటర్టైన్మెంట్ గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున గుంటూరులో మహేష్..అసలు కారణం ఇదే

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున గుంటూరులో మహేష్..అసలు కారణం ఇదే

0

సూపర్ స్టార్ మహేష్ (mahesh నయా మూవీ గుంటూరు కారం( guntur kaaram)కోసం మహేష్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ పోటా పోటీగా ఎదురుచూస్తున్నారు.ట్రైలర్ రిలీజ్ తో గుంటూరు కారం టికెట్స్ కోసం థియేటర్స్ కి రికమండేషన్ ఫోన్ లు కూడా వెళ్తున్నాయి. జనవరి 12 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న గుంటూరు కారం నుంచి వస్తున్న న్యూస్ ఒకటి మహేష్ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

గుంటూరు కారం నుంచి ఏ అప్ డేట్ కోసం మహేష్ అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారో ఇప్పుడు వాళ్ళ ఆశలు రేపటితో నెరవేరనున్నాయి.గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు గుంటూరులో జరగనుంది. గుంటూరు విజయవాడ జాతీయ రహదారి పై నంబూరు  క్రాస్ రోడ్ లోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లో సాయంత్రం 5  గంటలకి ఫంక్షన్ జరగనుంది.

ఇప్పుడు ఈ వార్తలతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. హైదరాబాద్ నుంచి మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గుంటూరు తరలి వెళ్లనున్నారు. లక్షలాది మంది మహేష్ అభిమానులు పాల్గొనే ఈ  కార్యక్రమంలో మహేష్ స్పీచ్ వినాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే ఈ ఈవెంట్ లో  మహేష్ త్రివిక్రమ్(trivikram) ల తో పాటు గుంటూరు కారంలో నటించిన నటి నటులు సాంకేతిక నిపుణులందరు పాల్గొంటున్నారు. 

 

Exit mobile version