Home ఆంధ్రప్రదేశ్ ఏపీలో 5.64 లక్షల ఓట్లు తొలగింపు, 50 మంది బీఎల్వోలపై చర్యలు- సీఈవో ముఖేష్ కుమార్...

ఏపీలో 5.64 లక్షల ఓట్లు తొలగింపు, 50 మంది బీఎల్వోలపై చర్యలు- సీఈవో ముఖేష్ కుమార్ మీనా-amaravati news in telugu ceo mukesh kumar meena says 5 64 lakh votes removed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

CEO Mukesh Kumar Meena : ఏపీ ఓటర్ల తుది జాబితాపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఓటర్ల అభ్యంతరాలు, దొంగ ఓట్ల తొలగింపు ఇలా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామన్నారు. డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామన్నారు. విజయవాడలో సీఈవో ముకేశ్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీల ఫిర్యాదులతో 14.48 లక్షల ఓట్లను పరిశీలించి 5,64,819 ఓట్లను అనర్హమైనవిగా గుర్తించామన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను కలెక్టర్లు తొలగించారని వెల్లడించారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. గందరగోళం లేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు.

Exit mobile version