మూడున్నర దశాబ్దాలకి పైగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న నటుడు చిరంజీవి. తాజాగా ఆయన తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ ఫంక్షన్ లో చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాయి.
చిరంజీవి నాన్న గారు కమ్యూనిస్ట్ కావడం వలన ఆయన ఇంట్లో దేవుడ్ని ఎవరు కొలిచేవారు కాదు. కానీ అప్పుడప్పుడు మాత్రం వాళ్ళ అమ్మ అంజనీదేవి గారు అందర్ని తిరుపతి కి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించేది.అలాగే చిరంజీవి తన 7 వ క్లాస్ ని బాపట్లలో చదివారు. అప్పుడు నైట్ ట్యూషన్ నుంచి వస్తు దారిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి ప్రసాదం కోసం ఆయన రోజు వెళ్ళేవాడు. అప్పుడు ఆ గుడి పూజారి ఆంజనేయ స్వామి గురించి చెప్తుండటంతో ఆంజనేయ స్వామి మీద చిరంజీవికి భక్తి భావం పెరుగుతు వచ్చింది. అలాగే ఒకసారి ఒక ఆటలో ఎవరికి రాని విధంగా చిరంజీవికి ఆంజనేయ స్వామి క్యాలండర్ వచ్చింది. ఈ రోజుకి ఆ క్యాలండర్ ఆయన ఇంట్లోనే ఉంది. అలాగే చిరు తండ్రికి చీరాల నుంచి ఉత్తరాంధ్ర ఏరియా కి ట్రాన్స్ ఫర్ అయితే ఆయన అంత దూరం వెళ్ళడానికి ఇష్టపడక ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాడు. అప్పుడు చిరు ఆయన చేత హనుమాన్ చాలీసా చదివించాడు.
దీంతో ఆ తర్వాత తన తండ్రి కోరుకున్న చోటకి బదిలీ అయ్యింది. ఈ విషయాలన్ని స్వయంగా చిరంజీవే హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాడు. అలాగే చిరంజీవి చెన్నై లో సినిమా అవకాశాలు కోసం ట్రై చేస్తున్న రోజుల్లో కూడా తనకి హనుమంతుడి లాకెట్ దొరికిందని ఆ తర్వాత ఆ లాకెట్ ని మెడలో ధరించాకే తను సినిమాల్లో నిలదొక్కుకున్నానని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆ లాకెట్ అన్నయ్య సినిమా షూటింగ్ లో మిస్ అయ్యిందని కూడా ఆయన చెప్పాడు. అలాగే హనుమంతుడ్ని నమ్ముకున్న రోజునే ఇండస్ట్రీలో ఎలాంటి తప్పటడుగులు వెయ్యకుండా ఉంటానని ఆయనకీ మాటఇచ్చానని దాని ప్రకారమే నడుచుకుంటు వచ్చానని కూడా చిరు చెప్పాడు. అలాగే ఎవరైనా తమ కోరిక నెరవేరాలంటే ఆంజనేయ స్వామి స్తోత్రం చదివితే వాళ్ళ కోరికలు నెరవేరతాయని ఇదంతా హిందూత్వ వాదంతో చెప్పటంలేదని కూడా ఆయన అన్నారు.