Home ఎంటర్టైన్మెంట్ నువ్వు సముద్రాన్ని టచ్‌ చేయలేవు..నేను నీపై దయ చూపించను!

నువ్వు సముద్రాన్ని టచ్‌ చేయలేవు..నేను నీపై దయ చూపించను!

0

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా డిఫరెంట్‌ జోనర్‌లో రూపొందుతోంది. నందమూరి కళ్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ‘దేవర’ చిత్రం మొదటి భాగాన్ని ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 


ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ‘దేవర’కి సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్‌ అయింది. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్‌ జనవరి 5న విడుదలైంది. 


‘నువ్వు సముద్రాన్ని టచ్‌ చేయలేవు.. నువ్వు నాతో ఆడుకోలేవు.. నేను నీపై దయ చూపించను..’ అంటూ ఇంగ్లీష్‌లో సాగే పాటతో ఈ వీడియో స్టార్ట్‌ అవుతుంది. ఆ తర్వాత ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌ వీరత్వాన్ని చూపించారు. శత్రువుల్ని హతమార్చిన తర్వాత తన కత్తిని సముద్రపు నీటితో కడుగుతాడు హీరో. ఆ సమయంలో సముద్రపు నీరు ఎర్రగా ఉంటుంది. అప్పుడు సముద్రం ముందు కూర్చొని ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాలి. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అనే డైలాగ్‌ను ఎన్టీఆర్‌ ఎంతో డెప్త్‌తో చెప్పారు. ఈ గ్లింప్స్‌ చూసిన తర్వాత సినిమా ఆద్యంతం సముద్రం నేపథ్యంలోనే సాగుతుందనే భావన కలుగుతుంది. ఈ గ్లింప్స్‌లో అనిరుధ్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ శాంపిల్‌ చూపించారు. చాలా ఎక్స్‌లెంట్‌గా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎన్టీఆర్‌ ఫుల్‌ మీల్స్‌లాంటి గ్లింప్స్‌ ఇచ్చి హ్యాపీగా ఫీల్‌ అయ్యేలా చేశారు. 

Exit mobile version