భారీ మౌలిక సదుపాయాలు, సామాజిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాలని రాజన్ డిమాండ్ చేశారు. సెస్ ద్వారా కేంద్రం చాలా నిధులు సమకూరుస్తోందని, వాటిని రాష్ట్రాలతో పంచుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాలు చాలా ముఖ్యమని, రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించి, నిధుల పంపిణీ స్థిరంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు.