ఇదీ జరిగింది..
దిల్లీలోని సదర బజార్‌కు సమీపంలో జరిగింది ఈ ఘటన. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి టీ స్టాల్ నడుపుకుంటున్నాడు. అతని దగ్గరు ముగ్గురు మైనర్లు పనిచేస్తున్నారు. వారి వయస్సు 12, 14, 15. కాగా.. చెత్త ఏరుకునే ఓ మహిళ, తరచూ అక్కడ టీ తాగుతుంది. అలా.. ఆ మహిళ, టీ స్టాల్ ఓనర్‌కు పరిచయం పెరిగింది. కాగా.. న్యూ ఇయర్ సందర్భంగా, జనవరి 1న.. ఆ వ్యక్తి, ఆ మహిళతో మాట్లాడాడు. “న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు మాకు ఒక అమ్మాయి కావాలి. అరేంజ్ చెయ్యి,” అని అన్నాడు. ఆమె సరే అని అక్కడికి వెళ్లిపోయింది.