Boycott Maldives trending : గత కొంతకాలంగా బలహీనపడుతూ వస్తున్న భారత్- మాల్దీవుల బంధం తాజాగా మరో కీలక మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లడం, అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల మంత్రి కౌంటర్ వేయడంతో వివాదం మొదలైంది. మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫలితంగా.. బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి!