హనుమాన్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‍లో జనవరి 12న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీలోనూ విడుదల కానుంది. అలాగే, ఇంగ్లిష్, కొరియన్, జపనీస్, చైనీస్, స్పానిష్‍లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొంది అన్యాయం చేసే విలన్లపై పోరాడే యువకుడి పాత్రను ఈ చిత్రంలో పోషించారు తేజ సజ్జా. హనుమాన్ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శీను కీలకపాత్రలు చేశారు.