Home ఎంటర్టైన్మెంట్ ‘నా సామి రంగ’ ట్రైలర్.. ఈ సంక్రాంతి కూడా కింగ్ దే!

‘నా సామి రంగ’ ట్రైలర్.. ఈ సంక్రాంతి కూడా కింగ్ దే!

0

ఈ సంక్రాంతికి పలు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో కింగ్ నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) ఒకటి. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.

గ్లింప్స్, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ‘నా సామి రంగ’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ట్రైలర్ విడుదల తర్వాత ఈ అంచనాలు మరో రేంజ్ కి వెళతాయని అంటున్నారు. ట్రైలర్ కట్ అదిరిపోయిందని, ఈ సంక్రాంతి సినిమాల్లో ఇదే బెస్ట్ ట్రైలర్ కట్ అని చెబుతున్నారు. కాగా ట్రైలర్ జనవరి 10న విడుదలయ్యే అవకాశముందట. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. ఈ సినిమాపై బజ్ ఒక్కసారిగా వేరే లెవెల్ కి వెళ్లిపోతుందని సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అదే జరిగితే మరో సంక్రాంతి హిట్ కింగ్ ఖాతాలో పడటం ఖాయం.

Exit mobile version