Tuesday, February 4, 2025

ట్రాన్స్ జెండర్ గా మారిన భర్త, సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య!-siddipet crime news in telugu wife gave supari to kill transgender husband ,తెలంగాణ న్యూస్

హత్య చేయడానికి రూ.18 లక్షలకు ఒప్పందం

వెంకటేష్ మర్డర్ కు సిద్దిపేటకు చెందిన కాకతీయ ఫుట్వేర్ షాప్ ఓనర్ రమేష్ తో రూ.18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. రెండు విడతల్లో అతనికి రూ. 4.60 లక్షలు ఇచ్చారు. ప్లాన్ ప్రకారం డిసెంబర్ 11న నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన ఇప్పల శేఖర్ సహాయంతో వెంకటేష్ అలియాస్ రోజాకు బీర్ తాగించి, నిద్రపోయిన తర్వాత రాత్రి సమయంలో మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో వెంకటేష్ ను దిండుతో నొక్కి ఉపిరాడకుండా చేసి హతమార్చారు. అప్పట్లో వెంకటేష్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో వెంకటేష్ భార్య వేదశ్రీతో పాటు ఐదుగురి పాత్ర ఉందని తేల్చారు. తన భర్త వెంకటేష్ హత్య కు సుఫారి ఇచ్చినటువంటి వేదశ్రీని, అందుకు సహకరించిన బోయిని రమేష్, హత్య కు సహకరించిన ఇప్పల శేఖర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana