Home ఎంటర్టైన్మెంట్ ‘ఓజీ’ అప్డేట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్!

‘ఓజీ’ అప్డేట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ‘ఓజీ'(OG) సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చింది.

‘ఓజీ’ సినిమాలో అప్పటి హీరో వెంకట్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వెంకట్.. నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. కానీ హీరోగా సరైన బ్రేక్ రాకపోవడంతో.. ‘అన్నయ్య’, ‘భలేవాడివి బాసు’, ‘ఆనందం’, ‘శివరామరాజు’ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి సత్తా చాటాడు. అయితే కొన్నేళ్లుగా వెంకట్ సినిమాల్లో నటించడం తగ్గిపోయింది. ఒకటి అరా సినిమాల్లో కనిపిస్తున్నా అవి ఆయన కెరీర్ కి పెద్దగా ఉపయోగ పడటంలేదు. ఇలాంటి సమయంలో వెంకట్ కి ‘ఓజీ’ రూపంలో అదిరిపోయే అవకాశం లభించింది. మరి ఈ సినిమాతో వెంకట్ కి బ్రేక్ వస్తుందో లేదో తెలీదు కానీ.. ఆయన మాత్రం ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

తాజాగా వెంకట్ ‘ఓజీ’ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ థింగ్ అని, ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని అన్నాడు. సుజీత్ ఎంతో ప్రతిభగల దర్శకుడని, ఓజీ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందని తెలిపాడు.

Exit mobile version