Home తెలంగాణ స్వచ్ఛ సర్వేక్షణ్ లో జీహెచ్ఎంసీకి జాతీయ అవార్డు-hyderabad news in telugu ghmc got swachh...

స్వచ్ఛ సర్వేక్షణ్ లో జీహెచ్ఎంసీకి జాతీయ అవార్డు-hyderabad news in telugu ghmc got swachh survekshan awards ,తెలంగాణ న్యూస్

0

GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్వచ్ఛ సర్వేక్షణ్ లో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి పది రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్- 2023లో జాతీయ అవార్డుకు జీహెచ్ఎంసీని ఎంపిక చేసింది. 2023 సంవత్సరంలో గార్బేజ్ ఫ్రీ సిటీలో త్రీ స్టార్ రేటింగ్ జాబితాలో ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఉండగా….తాజాగా 5 స్టార్ రేటింగ్ తో జీహెచ్ఎంసీ ఈ జాతీయ అవార్డు సాధించింది. ఈ నెల 15న దిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అందించే జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎంసీకి ఆహ్వానం అందింది. కాగా జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ అవార్డు సాధించడం కోసం కృషి చేసిన సిబ్బందికి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ కమిషనర్ రోనాల్డ్ రాస్ ధన్యవాదాలు తెలియచేశారు.

Exit mobile version