యోగా అనగానే అందరికీ సూర్య నమస్కారాలే గుర్తొస్తాయి. వాటికి మించిన యోగాసనాలు ఎన్నో ఉన్నాయి. యోగాను కఠోరమైన సాధనగా భావించే వాళ్ళు ఎంతోమంది. నిజానికి యోగాను చేయడం మొదలు పెడితే అది సులువుగా మారిపోతుంది. శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రశాంతత లేని ఆధునిక జీవితంలో యోగా కచ్చితంగా మానసిక, శారీరక ప్రశాంతతను అందిస్తుంది.