Home తెలంగాణ జహీరాబాద్ టికెట్ పై నేతల కన్ను..! రేసులో బాగారెడ్డి, అలె నరేంద్ర కుమారుడు-ale narendra sons...

జహీరాబాద్ టికెట్ పై నేతల కన్ను..! రేసులో బాగారెడ్డి, అలె నరేంద్ర కుమారుడు-ale narendra sons eye on zaheerabad mp seat ,తెలంగాణ న్యూస్

0

Lok Sabha Election 2024 : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, జహీరాబాద్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీటు ఆశిస్తూ పలువురు నాయకులూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. జిలాలోని మెదక్ లోక్ సభ స్థానం నుండి రికార్డు స్థాయిలో ఏడూ సార్లు ఎంపీగా గెలిచిన…, మొగలిగుండ్ల బాగా రెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి, మెదక్ ఎంపీగా గెలిసిన మరొక నేత అలె నరేంద్ర కుమారుడు అలె భాస్కర్, 2019 ఎన్నికల్లో బీజేపీకి టికెట్ పైన పోటీచేసి ఓడిపోయిన బాణాల లక్ష్మా రెడ్డి, బీజేపీ పార్టీ నుండి బోధన్ ఎమ్మెల్యే సీటు కోసం విఫలయత్నం చేసిన పారిశ్రామికవేత్త మేడపాటి ప్రకాష్ రెడ్డి సీటు కోసం పోటీపడుతున్నవారిలో ఉన్నారు. జహీరాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండగ, మిగతా నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలు ఉన్నాయి.

Exit mobile version