Sunday Motivation: కొత్త సంవత్సరంలో ఎంతోమంది ఇది చేయాలి, అది చేయాలి అని కొత్త రిజల్యూషన్లు తీసుకుంటారు. కొంతమంది బరువు తగ్గాలని నిర్ణయం తీసుకుంటే, మరికొందరు ధూమపానం మానేయాలని రిజల్యూషన్ తీసుకుంటారు. కొత్త ఏడాదిలో తీసుకునే రిజల్యూషన్ల జాబితా ఎంతైనా ఉంటుంది. ఇలాంటి రిజల్యూషన్స్ తీసుకోవడం సులువే, కానీ వాటిని అమలు చేయడమే కష్టం. కొత్త సంవత్సరం వచ్చి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల్లో మీరు తీసుకున్న రిజల్యూషన్లు ఎంతవరకు అమలు చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి.