మేషరాశి
మేష రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. సన్నిహితులతో గొడవలు పడకుండా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్చ అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే శుభఫలితాలు కలుగుతాయి.