రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఉన్న కట్టెల గోడౌన్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో, వేగంగా అగ్నికీలలు వ్యాపించాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.