భారత్ జోడో యాత్ర తరహాలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో యాత్ర చేపట్టబోతున్నారు. ఈ సారి పాదయాత్రలా కాకుండా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. మణిపూర్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బస్సు యాత్ర చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు.