Rice and Cancer: దక్షిణ భారతదేశంలో ప్రధాన ఆహారం బియ్యమే. ఉత్తర భారత దేశంలో ఎక్కువగా చపాతీలు తింటారు కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం మూడు పూటలా అన్నం తినే వారి సంఖ్య ఎక్కువే. అన్నం తినడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎక్కువ కాలం పాటు చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. అందుకే అన్నం తిని పనులకు వెళ్లే వాళ్లే ఎక్కువ. అయితే అధ్యయనాలు చెబుతున్న ప్రకారం సరిగా ఉడికీ ఉడకని అన్నం తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం పై ఎంతో చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అన్నాన్ని సరిగా ఉడికించాకే తినాలి లేకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.