హైదరాబాద్ లోని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉండే నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఆందోళన చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే బయటకి రావాలని సవాల్ విసిరారు. వ్యూహం లాంటి సినిమాలు తీసి ఏం చేద్దామని, సమాజానికి ఉపయోగపడే మూవీలు చేయాలన్నారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దిష్టి బొమ్మను కాల్చారు.