Home అంతర్జాతీయం Crime news: పబ్ లో గొడవ; ఆ తరువాత కారుతో ఢీ కొట్టి యువతి హత్య-man...

Crime news: పబ్ లో గొడవ; ఆ తరువాత కారుతో ఢీ కొట్టి యువతి హత్య-man runs over a woman and her friend with suv in jaipur after quarrel in pub ,జాతీయ

0

ఎస్ యూ వీ తో ఢీ కొట్టి..

జైపూర్ లోని జవహర్ సర్కిల్ ప్రాంతంలోని ఓ పబ్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాధితుడు రాజ్ కుమార్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పబ్ మేనేజ్మెంట్ లో ఒకరైన బాధితుడు రాజ్ కుమార్ తన స్నేహితురాలు ఉమ (19) తో కలిసి సోమవారం రాత్రి సమయంలో ఆ పబ్ కు వెళ్లాడు. పైకప్పు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రాజ్ కుమార్, ఉమ రాత్రి 11 గంటల సమయంలో డిన్నర్ చేసేందుకు రెస్టారెంట్ కు వచ్చారు. నిందితుడు మంగేష్ తన ప్రియురాలితో కలిసి అక్కడే మద్యం సేవిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఉమపై మంగేశ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. రాజ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఉమ తనకు ముందే తెలుసని మంగేష్ చెప్పాడు. ఆ తరువాత వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో మంగేష్ ఉమను తాకేందుకు ప్రయత్నించడం ఘర్షణ తీవ్రమైంది. కాసేపటికి రాజ్ కుమార్, ఉమ బయటకు వెళ్లి, క్యాబ్ కోసం ఎదురు చూడసాగారు. అదే సమయంలో బయటకు వచ్చిన మంగేశ్ కూడా తన ఎస్యూవీ కారును వేగంగా తీసుకువచ్చి, వారిద్దరిని ఢీ కొట్టి, పరారయ్యాుడు.

Exit mobile version