వైసీపీ అధినేత, సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన తీవ్రతరం చేశారు. వంటిట్లో సామాన్లు తెచ్చి గరిటలతో శబ్దాలు చేశారు. తమ జగన్ ఎలాగో పట్టించుకోవటం లేదని, కోతికి వినతిపత్రం ఇచ్చారు. అటు సోమవారం పలుచోట్ల నిరసన శిబిరాల్లోనే ఉద్యోగులు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.