గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్..ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒకమైలు రాయిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజులపాటు ఉంటుందన్నారు. ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆనందం చేశారు. ఆ తర్వాత క్రీడాకారులతో మాట్లాడిన జగన్… మంత్రి రోజాకు బ్యాట్ పట్టుకునే విధానాన్ని చూపించారు. ఇలా ఆడాలని నేర్పించారు.