Tripti Dimri:యానిమల్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఆ చిత్రంలో రణ్‍బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన తృప్తి.. తన అందంతో ఆకట్టుకున్నారు. సరికొత్త నేషనల్ క్రష్ అయ్యారు. దీంతో తృప్తి తర్వాత చేసే సినిమాలపై ఆసక్తి నెలకొంది. కాగా, తృప్తి డిమ్రికి తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‍లో ఎంతో పాపులర్ అయిన ఆషికీ ఫ్రాంచైజీలో తదుపరి రానున్న ఆషికీ 3 మూవీలో హీరోయిన్‍గా తృప్తి డిమ్రికి అవకాశం దక్కిందని సమాచారం బయటికి వచ్చింది.