కుల, మత పిచ్చిలు కూడా మీలో ఉండకూడదు. ప్రతి మతాన్ని గౌరవించే లక్షణం మీకుండాలి. ఒక వర్గానికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. మంచి వారు ధనిక, పేద, ముస్లిం, హిందూ… ఎవరైనా సరే వారితో స్నేహం చేయాలి. పొదుపు చేసే లక్షణం మీలో ఉంటే మీ జీవితం విజయానికి చేరువు అవుతుంది. అలాగని పిసినారిలా ఉన్నా విజయం కష్టమే.