Monday, January 20, 2025

నల్లి బొక్క కోసం గొడవ, పోలీస్ స్టేషన్ కు పంచాయితీ-చివరికి పెళ్లి క్యాన్సిల్!-jagtial crime news in telugu groom family cancels marriage over mutton bone marrow ,తెలంగాణ న్యూస్

అసలేం జరిగింది?

మటన్‌లో నల్లి బొక్క విషయంలో వరుడు, వధువు తమ్ముడి మధ్య గొడవ జరిగి చివరకు పెళ్లి క్యాన్సిల్‌కు దారితీసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులు, జగిత్యాల జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఇటీవలే వధువు ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నిశ్చితార్థం అనంతరం వధువు కుటుంబ సభ్యులు వరుడి కుటుంబ సభ్యులు, బంధువులకు నాన్ వెజ్ భోజనాలు పెట్టారు. అంతా బాగానే సాగుతున్న సమయంలో మటన్ నల్లి బొక్క వడ్డించలేదని వరుడి బంధువులు అడిగారు. వంటవాళ్లు నల్లి బొక్క ఎక్కువగా వేయలేదని వధువు బంధువులు చెప్పారు. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana